Satya Kumar Yadav : అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య సేవలు మరింత మెరుగు పడ్డాయని అన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ (Satya Kumar Yadav). శుక్రవారం జరిగిన శాసన సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఎన్డీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద రాష్ట్రంలో ఆరోగ్య సేవలు విస్తృతంగా అందుతున్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్
ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 13.4 లక్షలకు పైగా ప్రజలు వైద్య చికిత్స పొందారని వెల్లడించారు. ఇది మునుపటి వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి పాలనలో 2023-24లో 12.5 లక్షలతో పోలిస్తే ఎక్కువ అని స్పష్టం చేశారు సత్య కుమార్ యాదవ్.
Minister Satya Kumar Yadav Key Comments
ఆరోగ్యశ్రీని డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్‌గా మార్చామని తెలిపారు. ఈ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలు గణనీయంగా మెరుగు పడేలా చేశామని చెప్పారు. గత సంవత్సరం 12.5 లక్షల మందితో పోలిస్తే 2024-25లో 13.4 లక్షల మందికి పైగా ప్రయోజనం పొందారని యాదవ్ అన్నారు. ట్రస్ట్ సేవలు ఆగి పోయాయనే పుకార్లను తోసి పుచ్చారు మంత్రి. రోగులు బాధ పడుతున్న సమయంలో రాజకీయ మైలేజ్ కోసం తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన ఆరోపించారు. రోగులకు సేవలను కొనసాగించడంలో మునుపటి వైసీపీ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించిందని ఆరోపించారు. తమ సర్కార్ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రావాల్సిన బకాయిలను క్లియర్ చేయడం ప్రారంభించిందని చెప్పారు సత్య కుమార్ యాదవ్. చెప్పిన దాని ప్రకారం, రూ.2,222 కోట్ల విలువైన బకాయిలు క్లియర్ చేశామన్నారు.
Also Read : Rahul Gandhi Shocking Comments on EC : ఓట్ చోరీ నిజం నిరూపించేందుకు సిద్దం : రాహుల్
