Sasivadane Movie Trailer Sensational : గోదావ‌రి ప్రేమ క‌థ శ‌శివ‌ద‌నే ట్రైల‌ర్

ర‌క్షిత్ అట్లూరి కోమ‌లీ కీల‌క పాత్ర‌లు

Hello Telugu - Sasivadane Movie Trailer Sensational

Hello Telugu - Sasivadane Movie Trailer Sensational

Sasivadane : ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది మ‌రో ప్రేమ‌క‌థ‌తో గోదావ‌రి ప్రేమ‌కథ ఆధారంగా రూపొందించిన చిత్రం శ‌శివ‌ద‌నే. ఈ సినిమా ట్రైల‌ర్ ను ఇవాళ విడుద‌ల చేశారు. గ‌తంలో విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని విజ‌య‌వంతమైన చిత్రం ప‌లాస 1978లో న‌టించిన న‌టీ న‌టులు ర‌క్షిత్ అట్లూరి, కోమ‌లిలు మ‌రోసారి ఈ సినిమా కోసం జ‌త‌క‌ట్టారు. మ‌రోసారి అల‌రించేందుకు రెడీ అయ్యారు. గోదావ‌రి అందాలు అంటేనే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది భావుక‌త‌కు అద్దం ప‌ట్టిన ద‌ర్శ‌కుడు వంశీ. అలాంటి ఫీలింగ్స్ వ‌చ్చేలా ఈ ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నం చేశాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Sasivadane Movie Trailer Released

ఇక న‌టీ న‌టులు శ‌శివ‌ద‌నే (Sasivadane) రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ కోసం ప్రేమ‌ను పండించారు. ఈ సినిమాకు సాయి మోహ‌న్ ఉబ్బ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని అహ్ తేజ బెల్లంకొండ నిర్మించారు. ఎస్వీఎస్ స్టూడియోస్ ప్రైవేట్ లిమెటెడ్ , ఏజీ ఫిల్మ్ కంపెనీలు స‌మ‌ర్పించాయి. ఈ చిత్రానికి సంబంధించిన సంగీతం, పాట‌లు మ‌రింత ఉత్సుక‌త‌ను క‌లిగించేలా చేసింది. ఇక మూవీ మేక‌ర్స్ ట్రైల‌ర్ సంద‌ర్బంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈనెల 10వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ప్రేమ కోసం యుద్ధం అనే ఆలోచన చుట్టూ కేంద్రీకృతమైంది. ఈ ట్రైలర్ గోదావరి నేపథ్యంలో అందమైన, శక్తివంతమైన ప్రేమకథను ప్రదర్శిస్తుంది.

Also Read : Popular Director Tharun Bhascker : బాబా బ్లాక్ షీప్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్

Exit mobile version