గోవా : న్యూ ఇయర్ సందర్బంగా వైరల్ గా మారారు ప్రముఖ మాజీ భారత జట్టు కెప్టెన్ సచిన్ రమేష్ టెండూల్కర్. ఆయన ముద్దుల కూతురు సారా టెండూల్కర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దేశ వ్యాప్తంగా. తను సోయి లేకుండా ఏకంగా మద్యం (బీరు) బాటిల్ తో దర్శనం ఇచ్చింది ఈ అమ్మడు. నూతన సంవత్సరం పండుగను పురస్కరించుకుని తను ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో దర్శనం ఇచ్చింది. అంతే కాదు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఈ అమ్మడు ఉన్నట్టుండి బరితెగించింది. ఏకంగా మద్యం బాటిల్ తో కలిసి దర్శనం ఇవ్వడంతో ఫోటోలు, వీడియోలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి.
గోవాలో మద్యం బాటిల్ పట్టుకొని కనిపించింది. అర్రోసిమ్ బీచ్‌లో సారా తన స్నేహితులతో కలిసి బీరు చేతిలో పట్టుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో వైరలవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తండ్రి ఆదర్శాలకు విరుద్ధంగా కూతురి ప్రవర్తన ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. తీవ్ర స్తాయిలో మండి పడుతున్నారు. ఆయనతో పాటు కూతురును కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సచిన్ మాత్రం ‘తాను ఎప్పుడూ మద్యం, పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేయనని గతంలో ప్రకటించారు. కానీ తన కూతురు మాత్రం అందుకు విరుద్దంగా ప్రవర్తించడం విస్తు పోయేలా చేస్తోంది.



















