బెంగళూరు : మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిట్ చాట్ సందర్బంగా టి20 వరల్డ్ కప్ లో ఎంపిక చేసిన భారత జట్టుపై స్పందించాడు. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే ఓపెనింగ్ చేయాలని సూచించాడు. ఇటీవల జట్టులో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ప్రస్తావించాడు. పలుమార్లు మార్పులు చేయడంతో జట్టులో సమతుల్యత లోపించిందని పేర్కొన్నాడు. పరోక్షంగా హెడ్ కోచ్ గంభీర్ తో పాటు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ల ఎంపిక తీరు పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపాడు. ఏ ఒక్కరూ కూడా తెల్ల ఏనుగులను భరించరని బాంబు పేల్చాడు.
కావాలని గత కొంత కాలంగా సంజూ శాంసన్ ను పక్కన పెట్టడం, ఆ తర్వాత ఎంపిక చేయడం, తను బ్యాటర్ గా నిరూపించు కోవడం తో ఒత్తిళ్లకు తట్టుకోలేక ఎంపిక చేశారని లేక పోయి ఉంటే తనను మరోసారి పక్కన పెట్టేసే వారని మండిపడ్డాడు రాబిన్ ఊతప్ప. తన వరకు ఓపెనింగ్ కాంబినేషన్ కు సరిగ్గా సరి పోతాడని స్పష్టం చేశాడు. మరోసారి బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయొద్దని సూచించాడు గంభీర్ కు. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాల కంటే టీమ్ ప్రయోజనాలు అత్యంత ముఖ్యమని, ఆ విషయం గుర్తుంచుకుంటే మంచిదని సూచించాడు. సంజూ శాంసన్ లేదా అభిషేక్ శర్మలో ఎవరైనా రాణిస్తే భారత్ భారీ స్కోరు సాధిస్తుందని స్పష్టం చేశాడు రాబిన్ ఊతప్ప.
















