సఫారీల‌తో సంజు శాంస‌న్ ను ఆడించాలి

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సునీల్ గ‌వాస్క‌ర్

hellotelugu-gaavaskaar

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేటర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను నిర్వ‌హిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు జ‌ట్లు ఇంటి బాట ప‌ట్టాయి. మ‌రికొన్ని జ‌ట్లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించు కుంటున్నాయి. ఈ త‌రుణంలో సూప‌ర్ 8కు చేరుకోవ‌డంతో అంచ‌నాలు ఈ టోర్నీపై మ‌రింత పెరిగాయి. మ‌రో వైపు సూర్య భాయ్ సార‌థ్యంలోని టీమిండియా వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ వ‌చ్చింది. ఇప్ప‌టి వర‌కు లీగ్ లో భాగంగా అమెరికా, పాకిస్తాన్, న‌మీబియా , నెద‌ర్లాండ్స్ జ‌ట్ల‌తో ఆడింది. అన్ని మ్యాచ్ ల‌లో గెలుపొందింది . ఇదిలా ఉండ‌గా స్టార్ యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆశించిన స్థాయిలో ఆడ‌లేక పోయాడు. అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు.

త‌ను వ‌రుస‌గా డ‌కౌట్ల‌తో ఆశ్చ‌ర్య పోయేలా చేశాడు. దీంతో తిరిగి ఒక్క‌సారి కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కు ఛాన్స్ ఇవ్వాల‌ని కోరుతున్నాడు. త‌న‌ను ఏరికోరి ఎంపిక చేస్తే త‌ను కూడా ఆశించిన మేర రాణించ‌లేక పోయాడు. విచిత్రం ఏమిటంటే కీవీస్ తో జ‌రిగిన టి20 సీరీస్ లో త‌ను 5 మ్యాచ్ లు ఆడి 50 ర‌న్స్ చేశాడు. న‌మీబియాతో కేవ‌లం 8 బంతులు ఆడి మూడు సిక్సులు, ఒక ఫోర్ తో 24 ర‌న్స్ చేశాడు. అయితే ఇషాన్ కిష‌న్ దంచి కొడుతుండ‌డంతో త‌న‌ను త‌ప్పించారు. కానీ డ‌కౌట్ అవుతున్నా అభిషేక్ ను కంటిన్యూ చేయ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు సునీల్ గ‌వాస్క‌ర్. త‌న స్థానంలో శాంస‌న్ ను తీసుకోవాల‌ని సూచించాడు టీం మేనేజ్ మెంట్ కు.

Exit mobile version