ముంబై : మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగిన కీలకమైన టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లో సంజూ శాంసన్ ఓపెనర్ గా వచ్చాడు. తను కేవలం ఎనిమిది బంతులు మాత్రమే ఎదుర్కొని 22 రన్స్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటూ చాలా దూకుడుగా ఆడాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టి20 సీరీస్ లో తను విఫలం అయ్యాడు. 5 మ్యాచ్ లు ఆడి కేవలం తను 50 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో వరల్డ్ కప్ లో అమెరికా జట్టుతో జరిగిన కీలక తొలి మ్యాచ్ లో తనను తీసుకోలేదు జట్టు మేనేజ్మెంట్. అనూహ్యంగా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ నిరాశ పరిచాడు. తను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఇషాన్ కిషన్ తో కలిసి ఓపనింగ్ ప్రారంభించే ఛాన్స్ దక్కింది శాంసన్ కు.
దీనిపై ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. సంజు సామ్సన్ ను చూసినప్పుడు, ఒక పాజిటివ్ నిజంగా ప్రత్యేకంగా నిలిచింది. కొంతకాలం ఆటగాడి చేతిలో పడగొట్టబడిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు, మొదటి స్కోరింగ్ షాట్ సాధారణంగా మైదానంలో సురక్షితమైన సింగిల్ అవుతుంది. కానీ ఇది భిన్నంగా ఉంది. అతని మొదటి స్కోరింగ్ షాట్ దూకుడుగా ఉంది, ఆపై అతను మరో రెండు హై-రిస్క్ షాట్లు ఆడాడని పేర్కొన్నాడు . అతని మనస్తత్వం చాలా స్పష్టంగా ఉందని చూపిస్తుంది. శాంసన్ నమ్మకంగా, సానుకూలంగా కనిపించాడు. అతను బ్యాట్‌ను ఎక్కువసేపు నిటారుగా ఉంచడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు, అందుకే ఆ ఓవర్-ది-కవర్ షాట్ చాలా బాగుందన్నాడు పఠాన్. శర్మ ఫిట్ కాక పోతే శాంసన్ కు పూర్తిగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు.
