ముంబై : బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే కీలకమైన భారత జట్టును ప్రకటించింది. ముంబైలోని బీసీసీఐ కీలక సమావేశం జరిగింది. శనివారం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు న్యూజిలాండ్ తో జరిగే సీరీస్ తో పాటు ఇదే జట్టు వరల్డ్ కప్ లో పాల్గొంటుందని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం అవుతోంది. గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంచిన కేరళ స్టార్ సంజూ శాంసన్, రింకూ సింగ్, ఇషాన్ కిషన్ లకు చోటు కల్పించడం విశేషం. ఇప్పటికే వికెట్ కీపర్ గా ఎంపిక చేసిన జితేష్ శర్మను కూడా డ్రాప్ చేశారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ట్రోలింగ్ కు గురవుతున్న టి20 జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న శుభ్ మన్ గిల్ ను పూర్తిగా జట్టు నుంచి తప్పించారు. తను ఇప్పటి వరకు 30 మ్యాచ్ లు ఆడాడు. తను చేసింది 291 రన్స్ మాత్రమే. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
తాజాగా ప్రకటించిన టీంలో కీలకమైన మార్పులు చేశారు. తొలగించిన శుభ్ మన్ గిల్ వైస్ కెప్టన్ స్థానంలో అక్షర్ పటేల్ ను నియమించినట్లు ప్రకటించాడు అజిత్ అగార్కర్. ఇదే సమయంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు కూల్ గా సమాధానం ఇచ్చారు. శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారని వెల్లడించాడు. ఇక జట్టు పరంగా చూస్తే సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).



















