కేరళ : కేరళలో ఎన్నికలు ముగిశాయి. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో ఇండియాలో జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో కీలక భూమిక పోషించడమే కాకుండా భారత దేశాన్ని విశ్వ విజేతగా నిలిపి హీరోగా మారాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. అయితే ఆ తర్వాత ప్రారంభమైన ప్రతిష్టాత్మకమైన మెగా ఐపీఎల్ టోర్నీలో వరుసగా తను మూడు మ్యాచ్ లలో 9,6,7 పరుగులు మాత్రమే చేశాడు. తీవ్రంగా నిరాశ పరిచాడు. ఈ సమయంలో నాల్గవ కీలక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో సంజూ శాంసన్ తన పూర్వ పు ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.
ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా తను నమోదు చేశారు. అంతే కాదు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. తనకు మూడు అవార్డులు దక్కాయి. ఎక్కువ సిక్సర్లు కూడా తనే కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు బాధిన క్రికెటర్ల జాబితాలో సంజు శాంసన్ నాల్గవ స్థానంలో నిలిచాడు . ఈ సందర్బంగా ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనంటే తనకు ఎంత అభిమానమో మరోసారి ఎక్స్ వేదికగా ఆదివారం పంచుకున్నాడు. మూడు వైఫల్యాల తర్వాత శాంసన్ నిన్న రాత్రి రాణిస్తాడని నాకు మనసులో బలంగా అనిపించిందన్నాడు.
అన్నింటినీ పక్కనపెట్టి, నిశ్శబ్దంగా, పెరుగుతున్న సంతృప్తితో మ్యాచ్ చూశానని అన్నాడు ఎంపీ. చెన్నై విజయాన్ని చూసి కేరళ, తిరువనంతపురం, దాని మధ్యప్రదేశ్ ఆనందిస్తున్నాయన్నాడు. అలాగే చెన్నై ఆలస్యపు విజయానికి ఒక సామాన్య మలయాళీ అందించిన తోడ్పాటును చూసి కూడా అని పేర్కొన్నాడు. ఇలాగే నువ్వు ఆడుతూనే ఉండాలన్నాడు శశి థరూర్.



















