ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేరళ క్రికెటర్ సంజు శాంసన్ పై ప్రశంసలు కురిపించారు. ముంబైలో జరిగిన శాసన సభ సమావేశాల సందర్బంగా ఆయన భారత జట్టు ఐసీసీ టి20 వరల్డ్ కప్ గెలిచిన నందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేశారు. ప్రత్యేక తీర్మానం కూడా చేసింది మరాఠా ప్రభుత్వం. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ప్రశంసిస్తూనే ప్రత్యేకంగా సంజు శాంసన్ గురించి ప్రస్తావించారు సీఎం ఫడ్నవీస్. తను ఒక యోధుడి లాగా ఆడాడని, తను ఆడక పోయి ఉండి ఉంటే ఇవాళ భారత జట్టు కప్ ను గెలిచి ఉండేది కాదన్నాడు.
తను కీలకమైన మూడు మ్యాచ్ లలో ఒంటరి పోరాటం చేశాడని, తన వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు సీఎం. ఇదే క్రమంలో మిగతా ఆటగాళ్లు కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. విచిత్రం ఏమిటంటే సంజు సామ్సన్ తొలుత టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్ లలో ఆడలేదు. కానీ అనుకోకుండా ఛాన్స్ పొందాడు. అప్పటికే తనపై విమర్శలు కొనసాగుతున్నాయి. కీవీస్ సీరీస్ లో తను పేలవమైన ఆటతీరుతో నిరాశ పరిచాడు. కానీ నమీబియా, జింబాబ్వేతో తన వంతు పాత్ర పోషించాడు. కానీ క్వార్టర్స్ లో విండీస్ తో , సెమీస్ లో ఇంగ్లండ్ తో, ఫైనల్ లో న్యూజిలాండ్ తో ఇండియాను విజయపు అంచుల తీరాలకు చేర్చాడని కొనియాడారు దేవేంద్ర ఫడ్నవీస్.
యావత్ భారత దేశం తనకు సలాం చేస్తోందని చెప్పారు. కష్టాలు ఎదురైనా, ఇబ్బందులు కలిగినా ఎక్కడా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా తనను తాను ప్రూవ్ చేసుకున్న తీరు కోట్లాది మంది యువతకు స్పూర్తి దాయకంగా నిలుస్తుందని అన్నారు సీఎం.



















