దుబాయ్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన పర్ ఫార్మెన్స్ తో భారత జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. తను 5 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడి 321 రన్స్ చేశాడు. భారత దేశం తరపున ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా నిలిచాడు. అంతే కాదు ఇప్పటి వరకు టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన విరాట్ కోహ్లీ, షాహీన్ అఫ్రిదీ రికార్డులను బ్రేక్ చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకు ఎంపికయ్యాడు. వరుసగా నమీబియాతో 22 రన్స్ , జింబాబ్వేతో 24 , వెస్టిండీస్ తో 97, ఇంగ్లండ్ తో 89, న్యూజిలాండ్ తో 89 రన్స్ చేశాడు. ఎవరూ ఊహించని రీతిలో కమ్ బ్యాక్ లో సత్తా చాటాడు.
దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో 18 స్థానాలు దాటి 22వ ర్యాంక్ వద్ద నిలిచాడు. ఇక అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో నాలుగు వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా 6వ స్థానానికి ఎగబాకాడు. దీనికి విరుద్ధంగా అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు కిందకు పడి పోయాడు. మరో వైపు వరుణ్ చక్రవర్తి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచినప్పటికీ, గ్రూప్ దశ తర్వాత ఐదు మ్యాచ్‌ల్లో అతను కేవలం ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు, ఆ నాలుగు మ్యాచ్‌ల్లో అతని ఎకానమీ ఓవర్‌కు 10 పరుగులు దాటింది. దీంతో తన ర్యాంకింగ్ పడి పోయింది.


















