స‌త్తా చాటిన సంజు, మాత్రే సీఎస్కే సూప‌ర్ విక్ట‌రీ

32 ప‌రుగుల తేడాతో దుమ్ము రేపిన ప్లేయ‌ర్లు

hellottelugu-SanjuSamson

చెన్నై : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్ సెన్సేష‌న్ విక్ట‌రీ న‌మోదు చేసింది. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ స్కిప్ప‌ర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముందుగా బ‌రిలోకి దిగింది చెన్నై సూప‌ర్ కింగ్స్ . నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 192 ర‌న్స్ చేసింది. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ మ‌రోసారి స‌త్తా చాటాడు. త‌న‌తో పాటు యంగ్ క్రికెట‌ర్ ఆయుష్ మాత్రే సూప‌ర్ షో చేశాడు. ఈ ఇద్ద‌రు క‌లిసి అద్భుత భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ప‌వ‌ర్ ప్లే లో దుమ్ము రేపారు. క‌ళ్లు చెదిరే షాట్స్ అల‌రించాడు. తొలి ఓవ‌ర్ లోనే సంజు శాంస‌న్ మూడు ఫోర్లు కొట్టాడు. 32 బంతులు ఎదుర్కొన్న సంజు 48 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 3 సిక్సులు కొట్టాడు.

ఆయూశ్ మాత్రే 17 బంతులు ఎదుర్కొని 38 ర‌న్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 2 సిక్సులు కొట్టాడు. సీఎస్కే జ‌ట్టులోకి వ‌చ్చిన డెవాల్ట్ బ్రెవిస్ 29 బంతులు ఎదుర్కొని 41 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సులు కొట్టాడు. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ బౌల‌ర్లు సునీల్ న‌రైన్ 21 ర‌న్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అనుకుల్ రాయ్ 21 ప‌ర‌గులు ఇచ్చి ఒక వికెట్ కూల్చాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 3 ఓవ‌ర్లు వేసినా వికెట్ తీయ‌లేక పోయాడు. అనంత‌రం 193 ప‌రుగుల ల‌క్ష్యంతో మైదానంలోకి దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఆశించిన మేర రాణించ‌లేక పోయారు. సీఎస్కే బౌల‌ర్లు సూప‌ర్ షో చేశారు. దీంతో కేకేఆర్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 160 ర‌న్స్ చేసింది. ర‌మ‌ణ్ దీప్ సింగ్ 35 , పావెల్ 31 నాటౌట్ గా ఉన్నా గ‌ట్టెక్కించ‌లేక పోయారు. నూర్ అహ్మ‌ద్, కంబోజ్ ధాటికి చేతులెత్తేశారు.

Exit mobile version