Sanjay Raut : ముంబై : శివసేన బాల్ థాకరే పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోదీ పేరు పెట్టే ఆలోచనలో బీజేపీ సర్కార్ ఆలోచిస్తోందని ఆరోపించారు. భారీ ఖర్చుతో నిర్మించిన దీనిని పీఎం ప్రారంభించారు. స్థానిక ప్రజలు డిమాండ్ చేసినట్లుగా విమానాశ్రయానికి దివంగత రైతు నాయకుడు డిబి పాటిల్ పేరు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి స్వయంగా ఆయన పేరు పెడతారని శివసేన యుబిటి నాయకుడు సంజయ్ రౌత్ వివాదానికి తెర లేపారు. విమానాశ్రయానికి డిబి పాటిల్ పేరు పెట్టడాన్ని బిజెపి వ్యతిరేకిస్తోంది. పార్టీలో అంత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాల్సిన అవసరం లేదని ఒక ధోరణి ఉంది అని రౌత్ అన్నారు.
Sanjay Raut Shocking Comments
నవీ ముంబైలోని విమానాశ్రయానికి నరేంద్ర మోడీ పేరు పెట్టాలని బిజెపిలో ఏకాభిప్రాయం ఉంది. విమానాశ్రయానికి తన పేరు పెట్టాలని లేదా నరేంద్ర మోడీ పేరు పెట్టాలని పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కూడా డిమాండ్ చేశారు. అందువల్ల, నవీ ముంబై విమానాశ్రయానికి డిబి పాటిల్ పేరు పెట్టడం సాధ్యం కాదు అని రౌత్ అన్నారు . ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ , సిడ్కో మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కింద నవీ ముంబై ఎయిర్ పోర్టును నిర్మించారు. మోడీ విష్ణువు పదమూడవ అవతారమని, విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. అహ్మదాబాద్ స్టేడియానికి ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టారు. చివరకు దానిని మార్చి మోదీ పేరు చేర్చారంటూ గుర్తు చేశారు.
Also Read : Shubman Gill Strong Challenge : శుభ్ మన్ గిల్ కు సవాల్ గా మారిన కెప్టెన్సీ
















