ఇంత‌క‌న్నా మంచి ఛాన్స్ శాంస‌న్ కు రాదు

ప్ర‌ముఖ కామెంటేట‌ర్ ఆకాశ్ చోప్రా కామెంట్స్

hellotelugu-SanjuSamson

ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు మాజీ క్రికెట‌ర్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ ఆకాష్ చోప్రా. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న‌కు ఇంత కంటే గొప్ప అవ‌కాశం భ‌విష్య‌త్తులో ఉండ‌ద‌ని పేర్కొన్నారు. ఒక ర‌కంగా స్టార్ ప్లేయ‌ర్ ను హెచ్చ‌రించాడు. ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ కప్ కొన‌సాగుతోంది. టీమిండియా తొలి మ్యాచ్ లో అమెరికా జ‌ట్టుతో త‌ల‌ప‌డింది. ఒకానొక ద‌శ‌లో కీల‌క‌మైన వికెట్ల‌ను కోల్పోయింది. ఆ స‌మ‌యంలో కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ఆదుకున్నాడు. జ‌ట్టును గెలిపించ‌డంలో బౌల‌ర్లు కూడా కీల‌క పాత్ర పోషించారు.

ఈ స‌మ‌యంలో ఆడిన టాప్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. ఇదే క్ర‌మంలో త‌ను తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యాడు. ఆ స‌మ‌యంలో సంజూ శాంస‌న్ స్వ‌దేశీ సీరీస్ లో త‌ను ఘోరంగా వైఫ‌ల్యం చెందాడు. కేవ‌లం 5 మ్యాచ్ లు ఆడి 50 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. దేశీవాళి పోటీల్లో దుమ్ము రేపిన శాంస‌న్ ను ఏరికోరి ఒత్తిళ్ల‌కు త‌ల‌వంచి సెలెక్ష‌న్ క‌మిటీ న్యూజిలాండ్ సీరీస్ తో పాటు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఎంపిక‌య్యాడు. దీంతో త‌న‌ను తొలి మ్యాచ్ లో త‌ప్పించారు. ఈ స‌మ‌యంలో ఇవాళ న‌మీబియాతో కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. శ‌ర్మ స్థానంలో శాంస‌న్ రానున్న‌ట్లు స‌మాచారం. దీనిపై ఆకాశ్ చోప్రా స్పందించాడు. తిరిగి ఫామ్ లోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. లేక‌పోతే ఇక కెరీర్ నాశ‌నం అయిన‌ట్లేన‌ని పేర్కొన్నాడు.

Exit mobile version