ముంబై : టీమిండియా ప్రధాన బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను మీడియాతో మాట్లాడాడు. నెట్ ప్రాక్టీస్ లోనే కాదు బయట కూడా చాలా అద్భుతంగా ఆడే నైపుణ్యం కలిగిన ఏకైక ఆటగాడు సంజూ శాంసన్ అని కితాబు ఇచ్చాడు. ప్రతి ఒక్క క్రికెటర్ ఏదో ఒక సమయంలో ఫామ్ కోల్పోతాడని పేర్కొన్నాడు. అలాగని తనను తక్కువ అంచనా వేయలేమని అన్నాడు. తను కోలుకోవడానికి, పరుగుల వరద పారించడానికి కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్ చాలు అని చెప్పాడు మోర్న్ మోర్కెల్. మైదానంలో పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు సంజూ శాంసన్ అని తెలిపాడు. ఇప్పటికే సూర్య కుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్ సైతం పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారని గుర్తు చేశారు.
ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఇప్పుడు పరుగుల వరద పారిస్తున్నారని చెప్పాడు మోర్న్ మార్కెల్. తన నుండి సంజూ శాంసన్ కు పెద్ద రిలీఫ్ కలిగింది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు శాంసన్ ను విమర్శిస్తున్న వారే. నిన్నటి దాకా దేశీవాళి క్రికెట్ లో అద్భుతంగా ఆడాడు. సెంచరీతో కదం తొక్కాడు. అయితే బౌలింగ్ కోచ్ నుండి మాత్రం పెద్ద ఉపశమనం లభించడం విశేషం ఈ ఓపెనర్ బ్యాటర్ కు. సంజూ శాంసన్ పేలవ ఫామ్ నుండి బయట పడటానికి కేవలం ఒక ఇన్నింగ్స్ దూరంలో ఉన్నాడని అన్నారు మోర్న్ మోర్కెల్. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ , సూర్య కుమార్ యాదవ్ వంటి ఇతర టాప్-ఆర్డర్ బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లను చితక బాదుతున్నప్పుడు, శాంసన్ ఇప్పటివరకు మూడు T20లలో అత్యధికంగా 10 పరుగులతో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు.


















