Saiyaara Shocking Collections : అరుదైన రికార్డుకు చేరువ‌లో సైయారా

సంజ‌య్ లీలా భన్సాలీ మూవీకి బ్రేక్

Hello Telugu - Saiyaara Succes

Hello Telugu - Saiyaara Succes

Saiyaara : మోహిత్ సూరి ఏ ముహూర్తంలో సైయారా మూవీని తీశాడో కానీ విడుద‌లైన నాటి నుంచే దుమ్ము రేపుతోంది. 2018లో సంజ‌య్ లీలా భ‌న్సాలీ తీసిన మూవీ సాధించిన రికార్డ్ ను బ్రేక్ చేసేందుకు ఇంకా కొద్ది దూరంలోనే ఉంది సైయారా. ఇంకా రూ. 6.23 కోట్ల దూరంలోనే ఉంది. ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి స‌రిగ్గా 33 రోజులు దాటింది. ఇందులో ముఖ్య భూమిక పోషించారు అహాన్ పాండే, అనీత్ ప‌ద్దా. ఈ ఇద్ద‌రి న‌ట‌న‌కు యూత్ ఫిదా అయ్యారు. ద‌ర్శ‌కుడు ఈ సినిమాను పూర్తిగా ప్రేమక‌థా చిత్రంగా మ్యూజిక‌ల్ హిట్ గా మ‌ల్చ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.

Saiyaara Movie Updates

వ‌ర‌ల్డ్ వైడ్ గా సైయారా (Saiyaara) నిక‌ర క‌లెక్ష‌న్స్ రూ. 332. 85 కోట్ల‌కు పైగా చేరుకున్నాయి. ఇది భార‌త దేశంలో దాదాపు రూ. 392.76 కోట్ల స్థూల ఆదాయంగా పేర్కొన్నారు సినీ వ‌ర్గాలు. మోహిత్ సూరీ తీసిన సైయారా క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి. 1వ వారం రూ. 175.25 కోట్లు వ‌సూలు కాగా, 2వ వారంలో రూ. 110 కోట్లు, 3వ వారం రూ. 29.75 కోట్లు, 4వ వారం రూ. 15.45 కోట్లు, 5వ వారంలో రూ. 2.40 కోట్లు వ‌సూలు అయ్యింది. మొత్తంగా రూ. 332.85 కోట్లు వ‌సూలైన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా సైయారా 2025లో అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రంగా సైయారా నిలిచింది. 33 రోజుల్లో ఇది ఓవ‌ర్సీస్ లో రూ. 161 కోట్ల గ్రాస్ ను వ‌సూలు చేసింది.

Also Read : Rangareddy Growth – Richest District దేశంలోనే ధ‌నిక జిల్లాగా రంగారెడ్డి

Exit mobile version