Sachin Tendulkar : చెన్నై : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ తెగ సంతోషానికి లోనయ్యాడు. దీనికి ప్రధాన కారణం ప్రముఖ భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ రమేష్ టెండూల్కర్ (Sachin Tendulkar) తో కలవడం. ఈ సందర్బంగా తన మ్యూజిక్ గురించి విన్నానంటూ చెప్పడంతో మనోడు తెగ ఖుషీ అయ్యాడు. ఇందుకు సంబంధించి ఫోటోలను స్వయంగా షేర్ చేశాడు ఎస్ఎస్ థమన్. భారతీయ క్రికెట్ రంగంలో మోస్ట్ పాపులర్ హీరోగా , ఐకాన్ గా గుర్తింపు పొందాడు సచిన్. ఆయనతో ప్రశంసలు పొందడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఎస్ఎస్ థమన్ కు ఆ ఛాన్స్ దక్కింది. తను తమిళం, తెలుగు సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ ఇస్తుంటాడు. తాజాగా సుజిత్ దర్శకత్వం వహించిన పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీకి సూపర్ మ్యూజిక్ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
Sachin Tendulkar Praises SS Thaman
ఇదిలా ఉండగా డల్లాస్ నుండి దుబాయ్ వరకు సచిన్ తో చాలా సరదాగా విమానంలో వస్తూ గడిపానని తెలిపాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. ఇద్దరం కలిసి ఓ కార్యక్రమాన్ని చేయొచ్చంటూ కూడా తీపి కబురు చెప్పాడు. తను సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) లో చురుకుగా కూడా పాల్గొంటాడు. ఒక యాక్షన్ ఎంటర్టైనర్‌లో తన నేపథ్య సంగీతం కోసం విస్తృత ప్రశంసలు అందుకున్నాడు. అంతే కాదు బోయపాటి శ్రీను దర్శకత్వంలో విడుదలకు సిద్దంగా ఉన్న బాలయ్య బాబు నటించిన అఖండ సీక్వెల్ మూవీకి కూడా తను సంగీతం అందించాడడు. భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి చిత్రాలలో థమన్ చేసిన కృషికి నందమూరి బాలకృష్ణ కూడా మెస్మరైజ్ అయ్యాడు.
Also Read : Mirai OTT Interesting Update : 10న జియో హాట్ స్టార్ లో మిరాయ్ స్ట్రీమింగ్
