S Jaishankar : ఢిల్లీ – కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వస్తువులపై అమెరికా సుంకాలను ఏకపక్షంగా విధించడం పట్ల మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రష్యన్ చమురుపై జరిమానాలు అన్యాయమైనవని పేర్కొన్నారు. శనివారం జై శంకర్ (S Jaishankar) మీడియాతో మాట్లాడారు. పశ్చిమ దేశాల ద్వంద్వ ప్రమాణాలను ఎత్తి చూపారు .రష్యన్ చమురు దిగుమతులకు సంబంధించి భారత వస్తువులపై అమెరికా అధిక సుంకాలను విధించడం దారుణమని, అనైతికమని స్పష్టం చేశారు. రైతులు, చిన్న ఉత్పత్తిదారులపై తీవ్ర భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
S Jaishankar Slams America
వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని రక్షించడంలో న్యూఢిల్లీ రాజీపడదని నొక్కి చెప్పారు. భారతదేశం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఎదుర్కనేందుకు సిద్దంగా ఉందన్నారు జై శంకర్. తమ ప్రాధాన్యత ముందు రైతులని, ఆ తర్వాత ఉత్పత్తిదారులకు రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధానమంత్రి మోదీ కృత నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు.
రష్యన్ ఇంధనాన్ని కొనుగోలు చేసినందుకు భారతదేశంపై వచ్చిన అదే విమర్శను చైనా , యూరోపియన్ దేశాల వంటి పెద్ద దిగుమతిదారులకు వర్తించలేదని ఆయన ఆరోపించారు. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన అమెరికా వాదనలు అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనాకు ఎందుకు వర్తించలేక పోయారంటూ ప్రశ్నించారు జై శంకర్.
Also Read : Bigg Boss 19 Interesting Update : బిగ్ బాస్ సీజన్ 19 కంటెస్టెంట్స్ లిస్ట్

















