Putin : రష్యా : ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీని ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin). సాధ్యమైనంత త్వరగా చర్చలకు రావాలని లేక పోతే మరోసారి యుద్దం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు ప్రెసిడెంట్. ఎవరి ప్రయోజనాల కోసం తను పాలన సాగిస్తున్నారో ప్రపంచానికి తెలుసన్నారు. గురువారం పుతిన్ మీడియాతో మాట్లాడారు. చర్చల ద్వారా యుద్దాన్ని ముగించేందుకు తాను సిద్దంగా ఉన్నానని, కానీ కాదని అనుకుంటే చర్యలకు దిగేందుకు, దాడులు చేపట్టేందుకు రెడీగా ఉన్నానని ప్రకటించారు. పదే పదే కవ్వించాలని చూస్తే తాను మౌనంగా ఉండబోనంటూ జెలెన్ స్కీని ఉద్దేశించి అన్నారు. తాజాగా రష్యా చీఫ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Vladimir Putin Slams Ukraine President
మరో వైపు జెలెన్ స్కీ సైతం ఫ్రాన్స్ లో కీలక సమావేశం లో పాల్గొనే కంటే ముందు మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ పై రష్యా దాడికి పాల్పడి మూడు సంవత్సరాలు పూర్తయ్యాయని అన్నారు. ఇప్పటి వరకు తమ దేశంపై 500 డ్రోన్లు, 12కి పైగా మిస్సైల్స్ తో దాడులకు పాల్పడిందని ఆరోపించారు. అయినా తట్టుకుని నిలబడ్డామన్నారు ప్రెసిడెంట్. శాంతియుతంగా చర్చలు జరిపేందుకు తాము ముందుకు వచ్చామని, కానీ రష్యానే ఏకపక్షంగా దాడులకు దిగిందని ఆరోపించారు. అమెరికా చీఫ్ ట్రంప్ పదే పదే చర్చలకు రావాలని పిలుపునిచ్చినా పట్టించు కోవడం లేదని మండిపడ్డారు జెలెన్ స్కీ. ఒకవేళ రష్యా అధ్యక్షుడు ముందుకు వస్తే తాను కూడా చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
Also Read : Ex Minister Chidambaram Shocking Comments : జీఎస్టీ సంస్కరణలపై చిదంబరం షాకింగ్ కామెంట్స్
















