Rupee : భారత రూపాయి మారకం విలువ వరుసగా క్షీణిస్తోంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి చరిత్రలో తొలిసారి ₹88.50ని దాటి ఆల్టైమ్ కనిష్టాన్ని తాకింది. మునుపటి సెషన్లో ₹88.32 వద్ద ముగిసిన రూపాయి, మంగళవారం మరింత దిగజారింది. నిపుణుల అంచనా ప్రకారం, ఈ రోజు ట్రేడింగ్ పరిధి ₹88.15 – ₹88.50 మధ్యలో ఉండే అవకాశం ఉంది.
Rupee – రూపాయి బలహీనతకు ప్రధాన కారణాలు
- భారతీయ వస్తువులపై అమెరికా సుంకాల పెంపు
- హెచ్1బీ వీసాల రుసుము $1 లక్షకు పెరగడం
- ఎఫ్పీఐలు దేశీయ మార్కెట్లో ₹2,900 కోట్ల షేర్ల విక్రయం
సెప్టెంబర్ ప్రారంభంలో రూపాయి ₹88.44 వద్ద ముగిసి ఆ సమయంలో కనిష్ట రికార్డు సృష్టించగా, ఈ రోజు మరింత బలహీనపడి కొత్త చరిత్ర సృష్టించింది.
Also Read : Stock Market Sensational : స్టాక్ మార్కెట్లో నష్టాల ధోరణి కొనసాగింపు


















