ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ సెన్సేష‌న్

60 బంతులు 11 ఫోర్లు 3 సిక్సులు

helloteelugu-ViratKohli

రాయ‌పూర్ : వ‌రల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఈసారి జ‌రుగుతున్న ఐపీఎల్ 19వ సీజ‌న్ లో ప్ర‌తీ మ్యాచ్ లో త‌న‌దైన రీతిలో రాణిస్తున్నాడు. ఆ జ‌ట్టుకు బ‌లంగా మారాడు. ఇప్ప‌టికే డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు మ‌రోసారి త‌న టైటిల్ ను నిల‌బెట్టుకునేందుకు రెడీ అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన లీగ్ మ్యాచ్ ల‌లో 8 విజ‌యాలు సాధించింది ఆర్సీబీ. మొత్తం 16 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో నిలిచింది. ఇక ప్లే ఆఫ్స్ రేసులో త‌న సీటును క‌న్ ఫ‌ర్మ్ చేసుకుంది. తాజాగా రాయ‌పూర్ లో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ను ఓడించింది.

మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసింది కేకేఆర్. యంగ్ ముంబై క్రికెట‌ర్ ర‌ఘువంశీ ఆర్సీబీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. త‌ను 71 ర‌న్స్ చేశాడు. త‌నకు తోడుగా మ‌రో క్రికెట‌ర్ రింకూ సింగ్ చివ‌రి దాకా ఉన్నాడు త‌ను 49 ప‌రుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కోల్ క‌తా 193 ర‌న్స్ భారీ స్కోరు టార్గెట్ ఇచ్చింది. మైదానంలోకి దిగిన ఆర్సీబీ ఆట‌గాళ్లు ఆడుతూ పాడుతూ గెలిచారు.కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 19.1 ఓవ‌ర్ల‌లోనే ప‌ని పూర్తి చేశారు. ఇక ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది ర‌న్ మెషీన్ గురించి . విరాట్ కోహ్లీ 60 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు 3 భారీ సిక్సుల‌తో 105 ర‌న్స్ చేసి అజేయంగా నిలిచాడు.

Exit mobile version