Rohit Sharma : ఆస్ట్రేలియా : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో ఆసీస్‌పై 1000 వన్డే పరుగులు చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ప్రస్తుతం టీమిండియా ఆసిస్ టూర్ లో ఉంది. ఇందులో భాగంగా వన్డే సీరీస్ కొనసాగుతోంది. ఆసిస్ పై వారి స్వదేశంలో 1071 రన్స్ చేశాడు హిట్ మ్యాన్. సగటున 56.36 తో స్ట్రైక్ రేట్ 89.32 తో రికార్డు సృష్టించాడు. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఆడాడు. గురువారం ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లలో 1000 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇదిలా ఉండగా రోహిత్ శర్మ గంగూలీని అధిగమించి వన్డేల్లో భారతదేశపు మూడవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 21 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
Rohit Sharma New Record
తను చేసిన పరుగుల్లో అత్యధికంగా 171 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. రోహిత్ శర్మ 97 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. ప్రస్తుత స్ట్రైక్ రేట్ 75.26. తన వన్డే ఫార్మాట్ లో రోహిత్ శర్మ 275 మ్యాచ్ లు ఆడాడు. 267 ఇన్నింగ్స్ లలో 48.69 సగటుతో 11,249 రన్స్ చేశారు. 32 సెంచరీలు, 59 అర్ధ సెంచరీలు చేశాడు. 264 అత్యుత్తమ స్కోరుగా ఉంది. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కూడా అధిగమించింది. ఇక ఇండియా తరపున వన్డే ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్ శర్మ నిలిచాడు. 308 మ్యాచ్‌ల్లో 40.95 సగటుతో 11,121 పరుగులు చేశాడు గంగూలీ. ఇందులో 22 సెంచరీలు 71 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read : MP Gurumurthy Shocking Comments : కక్ష సాధింపుల్లో భాగంగానే భూమన విచారణ


















