Rohit Sharma Shocking Comments : టెస్టు క్రికెట్ స‌వాలుతో కూడుకున్న‌ది

స్ప‌ష్టం చేసిన స్టార్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ

Hello Telugu - Rohit Sharma Shocking Comments

Hello Telugu - Rohit Sharma Shocking Comments

Rohit Sharma : ముంబై – భార‌త జ‌ట్టు స్టార్ క్రికెట‌ర్ , కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. టెస్టు క్రికెట్ ఫార్మాట్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ ఫార్మాట్ లో ఆడ‌డం అనేది ఛాలెంజ్ గా ఉంటుంద‌న్నాడు. కాగా రోహిత్ శర్మ (Rohit Sharma) 67 టెస్ట్‌ల్లో 4301 పరుగులకు 40.58 సగటుతో మంచి స్కోరు సాధించాడు, T20 అంతర్జాతీయ మ్యాచ్‌ల నుండి వైదొలిగిన తర్వాత ఒక సంవత్సరం మేలో ఐదు రోజుల ఆట నుండి రిటైర్ అయ్యాడు. ఈ ఫార్మాట్‌లో భారత్‌ను ప్రపంచ కప్ టైటిల్‌కు నడిపించాడు. డిసెంబర్ 8, 2024 ఆదివారం ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెజెంటేషన్ వేడుక కోసం వేచి ఉన్నాడు.

Rohit Sharma Key Comments

ఈ సంవత్సరం ప్రారంభంలో తన టెస్ట్ కెరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్న కొన్ని అంశాలను ప్రతిబింబిస్తూ భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు . ఈ ఫార్మాట్ సవాలుతో , శ్రమతో కూడుకున్నది ఉన్న‌ద‌న్నాడు. ప్ర‌తి ఆటగాడు 100 శాతం ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చాల‌ని అనుకుంటాడ‌ని అన్నాడు. త‌న జీవితంలో మ‌రిచి పోలేని జ్ఞాప‌కాలు చాలా ఉన్నాయ‌ని చెప్పాడు. ఇప్ప‌టికీ తాను క్రికెట్ ను శ్వాస‌గా చూస్తాన‌ని అది లేక పోతే ఉండ‌లేన‌ని అన్నాడు. ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ రంగంలో అద్భుత‌మైన ఆట‌గాళ్లు ఉన్నార‌ని, మ‌రికొంద‌రు వ‌స్తున్నార‌ని పేర్కొన్నాడు. ఇందుకు ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ దోహ‌దం చేస్తోంద‌న్నాడు. అయితే ఈ ఫార్మాట్ లో ఆడిన ఆట‌గాళ్లు టెస్టు ఫార్మాట్ లో కుదురు కునేందుకు వీలు ఉండ‌ద‌న్నాడు.

Also Read : Delhi Govt New Innovation : ఢిల్లీ స‌ర్కార్ స్టార్ట‌ప్ పాల‌సీ రిలీజ్

Exit mobile version