ల‌క్నో బౌల‌ర్ల భ‌రతం ప‌ట్టిన రెకెల్ట‌న్

విధ్వంస‌క‌ర విన్నింగ్స్ తో సూప‌ర్ షో

hellotelugu-RyanRickelton

ముంబై : ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓపెన‌ర్స్ రోహిత్ శ‌ర్మ‌, రెకెల్ట‌న్ లు దంచికొట్టారు. ల‌క్నో బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు ఈ ఇద్ద‌రూ క‌లిసి. చుక్క‌లు చూపించారు. విధ్వంస‌క‌ర‌మైన బ్యాటింగ్ తో ఆక‌ట్టుకున్నారు. అంతే కాదు క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించారు. ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించారు. దీంతో వ‌రుస అప‌జాయాల‌తో తీవ్ర నిరాశ‌కు గురి చేసిన ముంబై ఇండియ‌న్స్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక రోహిత్, రెకెల్ట‌న్ ఇద్ద‌రూ క‌లిసి అద్భుత భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఇక ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విష‌యానికి వ‌స్తే వ‌రుస‌గా ఈ ఓట‌మితో ప్లే ఆఫ్ ఆశ‌లు పూర్తిగా స‌న్న‌గిల్లాయి. 7 మ్యాచ్ ల‌లో ప‌రాజ‌యం పాలైంది.

ఇక‌ ఇప్ప‌టి వ‌ర‌కు ఆట‌కు దూరంగా ఉన్న మాజీ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ దుమ్ము రేపాడు. త‌ను 44 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని స‌త్తా చాటాడు. 6 ఫోర్లు 7 సిక్స‌ర్లతో 84 ర‌న్స్ చేశాడు. ముంబై ఇండియ‌న్స్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. మ‌రో వైపు ఓపెన‌ర్ ర్యాన్ రెకెల్ట‌న్ సూప‌ర్ షో చేశాడు. 32 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 83 ప‌రుగులు చేసి దంచి కొట్టాడు. దీంతో 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియ‌న్స్ గెలుపు సాధించింది. విండీస్ స్టార్ హిట్ట‌ర్ నికోల‌స్ పూర‌న్ 21 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 8 సిక్స‌ర్ల‌తో దంచికొట్టాడు. 63 ప‌రుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 25 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 44 ర‌న్స్ చేశాడు. హిమ్మ‌త్ సింగ్ 31 బంతులు ఎదుర్కొని 40 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 2 ఫోర్లు 2 సిక్స‌ర్లు కొట్టాడు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 228 ర న్స్ చేసింది

Exit mobile version