TTD : తిరుమల – తిరుమలలోని 5 పెద్ద క్యాంటీన్లు, 5 జనతా క్యాంటీన్ల కేటాయింపుల కోసం టీటీడీ ఆహ్వానించిన ఈవోఐ పత్రాల జారీ, సమర్పణ, పరిశీలనకు సంబంధించిన తేదీలను పరిపాలనా కారణాల వల్ల మార్పు చేయడం జరిగిందని తెలిపితి టీటీడీ (TTD) పాలక మండలి. తాజా షెడ్యూలు ప్రకారం మారిన తేదీలు క్రింది విధంగా ఉన్నాయి.
TTD Revised
పెద్ద క్యాంటీన్లకు సంబంధించి పత్రాల డౌన్‌లోడ్ ముగింపు తేదీ: 15-07-2025 నుండి 26-07-2025 సాయంత్రం 5 గంటలకు మార్చడం జరిగిందని, ఈ విషయాన్ని క్యాంటీన్ల నిర్వాహకులు గుర్తించాలని సూచించింది. ఇదిలా ఉండగా ఈవోఐ పత్రాల సమర్పణ చివరి తేదీ 17-07-2025 నుండి 28-07-2025 ఉదయం 11 గంటలకు మార్చడం జరిగిందని వెల్లడించింది టీటీడీ.
క్యాంటీన్ల నిర్వాహకులు సమర్పించిన పత్రాలను పరిశీలించేందుకు గాను తేది – 17-07-2025 నుండి 28-07-2025 మధ్యాహ్నం 12 గంటలకు మార్చడం జరిగిందని పేర్కొంది. ఇక జనతా క్యాంటీన్లకు గాను పత్రాల డౌన్‌లోడ్ ముగింపు తేదీ: 17-07-2025 నుండి 28-07-2025 సాయంత్రం 5 గంటలకు మార్పు చేయడం జరిగిందని స్పష్టం చేసింది.
ఈవోఐ పత్రాల సమర్పణ చివరి తేదీ 19-07-2025 నుండి 30-07-2025 ఉదయం 11 గంటలకు మార్పు చేశామని, ఇక సమర్పించిన పత్రాలను తెరిచేందుకు గాను 19-07-2025 నుండి 30-07-2025 మధ్యాహ్నం 12 గంటలకు మార్పు చేయడం జరిగిందని వెల్లడించింది.
ఆసక్తి గల దరఖాస్తుదారులు మారిన తేదీలను గమనించి, దాని ప్రకారం తగినవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది టీటీడీ.
Also Read : TTD EO Interesting Update : శ్రీవారి భక్తుల కోసం నూతన కాటేజీ విధానం



















