హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన లేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ ప్రాతినిధ్యం వహించే హైబ్రిడ్ ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేశారు. ఆయన హైబ్రిడ్ నమూనానే ఇస్తారని అన్నారు. హైదరాబాద్‌లో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసే ముందు రేవంత్ రెడ్డి ఎవరినైనా అడిగారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉండేదన్నారు. కానీ అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపించారు.
లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలన్న కేంద్రం ప్రతిపాదనపై కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. నిన్న పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లు లోపభూయిష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. ప్రవేశపెట్టిన బిల్లులో 50% ప్రస్తావన లేదన్నారు… కొత్త సీట్ల ఏర్పాటుకు లేదా ఎంపీ సీట్ల పెంపునకు జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే, ఇది పెద్ద ఆందోళన కలిగించే విషయం అన్నారు కేటీఆర్. పార్లమెంటులో దక్షిణ భారతదేశానికి 24% ప్రాతినిధ్యం ఉందన్నారు. దానిని కొనసాగించక పోతే, దక్షిణ భారతదేశంలో పెద్ద తిరుగుబాటు జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే బీఆర్ఎస్ ఇతర పార్టీలతో కలిసి ఈ చర్యను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు .
