తిరువనంతపురం | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి రెచ్చి పోయారు. మంగళవారం ఆయన కేరళలో పర్యటించారు. ప్రస్తుతం అక్కడ శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్బంగా తను అక్కడ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆయన నిప్పులు చెరిగారు కేరళ సీఎం పినరయ్ విజయన్ పై . కేరళ ముఖ్యమంత్రికి తాను రాసిన లేఖకు సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాజాగా తాను రాసిన లేఖ పై సీఎం ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు.
పినరయి విజయన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటే, అప్పుడు ఆయనతో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాననంటూ ప్రకటించాడు ఎ. రేవంత్ రెడ్డి. అసలు ఆయన ఆదర్శమూర్తులు ఎవరు? నరేంద్ర మోదీనా లేకఅమిత్ షాలా? లేక జ్యోతి బసు, సోమనాథ్ ఛటర్జీలా అన్నది తేల్చాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. పినరయి విజయన్ నరేంద్ర మోదీని తన ఆదర్శంగా అనుసరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. కేరళ ప్రజలకు ఇది ఏమాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. ఆయన అచ్చం మరొక నరేంద్ర మోదీలాగే ప్రచారం సాగిస్తున్నారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
కేరళలో పాలన గాడి తప్పిందని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. అందుకే ప్రజా సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో హస్తం జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు.
