ముంబై : ఈ ఏడాది బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా టోర్నీ ఐపీఎల్ లో పాల్గొనే కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి బిగ్ షాక్ తగిలింది. భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ తరుణంలో మన దేశంతో కయ్యానికి కాలు దువ్వుతున్న బంగ్లాదేశ్ కు చెందిన ప్లేయర్లను ఎలా ఆడిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ పెరిగాయి. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సైతం అభ్యంతరం తెలిపారు. ఈ తరుణంలో ఐపీఎల్ వేలం పాటలో ముస్తాఫిజుర్ రెహమాన్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది. తనను ఉన్నపళంగా వదులుకుంటే ఎలా అని మధన పడుతో ఆ జట్టు యాజమాన్యం.
దేశ వ్యాప్తంగా ఒత్తిళ్లు పెరగడంతో గత్యంతరం లేక దిగి వచ్చింది బీసీసీఐ. ఈ మేరకు శనివారం కీలక ప్రకటన చేసింది. తక్షణమే రెహమాన్ ను వెంటనే రిలీజ్ చేయాలని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా అర్థం చేసుకోవాలని, సహచరించాలని కోరింది. అయితే ఇదే క్రమంలో మరో కీలకమైన ఆటగాళ్లను ఎవరిని తీసుకున్నా తాము అనుమతి ఇస్తామని, ఇందుకు సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ బాడీలో కూడా తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై ఇటీవల దాడులు జరిగినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, బంగ్లాదేశ్ ఆటగాడిని చేర్చడం రాజకీయ వివాదానికి దారితీసింది. ఆధ్యాత్మిక గురువు దేవకినందన్ ఠాకూర్ షారుక్ ఖాన్ ను విమర్శించారు.



















