AP : అమరావతి : రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఏపీ (AP) సర్కార్ అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి సమీక్ష చేపట్టారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు. విధుల నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. న్యూ టెక్నాలజీని కూడా ఉపయోగించు కోవాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు నారా లోకేష్, అనిత వంగలపూడి, పొంగూరు నారాయణ , నిమ్మల రామానాయుడు రంగంలోకి దిగారు. ప్రత్యక్షంగా అందుతున్న సహాయ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
AP Real Time Voice Alert
ఇదిలా ఉండగా అవేర్నెస్ అలర్ట్ బ్రాడ్కాస్టింగ్స్ సాంకేతికత వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంది. తుపాను సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలన్న చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోస్తా జిల్లాల్లోని 26 తీరప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా మొంథా తుపాన్ హెచ్చరికలు
రియల్‌టైమ్ వాయిస్ అలర్ట్‌లను క్షణాల్లో అందిస్తున్నారు. విద్యుత్ అంతరాయం జరిగినా 360° హార్న్ స్పీకర్ వ్యవస్థ, ఒక కిలోమీటరు పరిధిలో కూడా స్పష్టమైన హెచ్చరికలను అందిస్తుంది. ఈ వ్యవస్థ మరిన్ని గ్రామాల్లో విస్తరించునున్నారు. ప్రజలకు మెసేజెస్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్స్, టాంటాంలు, క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా, అన్ని విధాలా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
Also Read : CM Chandrababu Warning for Cyclone : తుఫానుపై ఆందోళన వద్దు అప్రమత్తంగా ఉండాలి
















