Rahul Gandhi : ఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు కేంద్ర ఎన్నికల సంఘంపై. అది పూర్తిగా తన బాధ్యతలను విస్మరించిందని, ఓట్ చోరీకి పాల్పడిందన్నది వాస్తవం అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలతో సహా తాను బయట పెట్టానని, యావత్ జాతి మొత్తం చూసిందన్నారు. ఇందులో పూర్తిగా ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, ఈ విషయం ఓట్ చోరీ తో బయట పడిందన్నారు. ఈసీ ఎన్నికల నిర్వహణలో వివక్ష చూపుతోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీని, మోదీ సర్కార్ ను రక్షించేందుకు ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. విచిత్రం ఏమిటంటే తాను లేవదీసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన కేంద్ర ఎన్నికల కమిషనర్ అడ్డగోలుగా తనపై ఆరోపణలు చేశారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. తాను పక్కా సమాచారంతోనే బయటకు వచ్చానని చెప్పారు.
Rahul Gandhi Shocking Comments
గతంలో ఓట్ చోరీ జరిగిందని చెబితే పట్టించు కోలేదన్నారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తేనే కానీ ఈసీ దిగి రాలేదన్నారు. బీహార్ లో అక్రమంగా తొలగించిన 65 లక్షల ఓట్లను తిరిగి పబ్లిష్ చేసిందని చెప్పారు రాహుల్ గాంధీ (Rahul Gandhi). కేంద్రీకృత వ్యవస్థ ద్వారా, ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ద్వారా ఈ మొత్తం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు . దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క కర్ణాటకలోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగిందన్న అనుమానం తనకు ఉందని బాంబు పేల్చారు కాంగ్రెస్ ఎంపీ. ఒక బాధ్యత కలిగిన ఎన్నికల కమిషనర్ తన స్థాయిని మరిచి మాట్లాడటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read : KTR Fired on CM Revanth Reddy : కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్

















