బెంగళూరు : ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో వరుస విజయాలతో దూసుకు పోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్. కేఎల్ రాహుల్ సూపర్ గా ఆడితే ఊహించని రీతిలో డేవిడ్ మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అనుకోని రీతిలో జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు. ముందుగా ఆర్సీబీ 176 రన్స్ చేసింది. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్ తో కాస్త తడబడింది ఢిల్లీ క్యాపిటల్స్.
ఈ సమయంలో స్టబ్స్ 60 పరుగులు చేసి నాటౌట్ గా నిలిస్తే కేఎల్ రాహుల్ 57 పరుగులతో రెచ్చి పోయాడు. ఈ ఇద్దరూ కలిసి జట్టును ఆదుకున్నారు. ఇక కీలకమైన ఆఖరి ఓవర్ లో 14 రన్స్ కావాల్సి వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ కు. డేవిడ్ మిల్లర్ 22 రన్స్ చేశాడు .అజేయంగా నిలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లాడు. ఇందులో 2 సిక్సులు , ఒక ఫోర్ ఉన్నాయి. దీంతో ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ .ఈ విజయంతో ఆ జట్టుకు ఆరు పాయింట్లు లభించాయి. ఇదిలా ఉండగా వరుస విజయాలతో దూసుకు పోతున్న ఆర్సీబీకి ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేసింది. ఆజట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైతో ఓటమి పాలైంది. అంతకు ముందు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో షాక్ తిన్నది.



















