Popular Cricketer Ravi Shastri : శుభ్ మ‌న్ గిల్ డాన్ బ్రాడ్ మాన్ లాంటోడు

ప్ర‌శంస‌లు కురిపించిన మాజీ క్రికెట‌ర్ ర‌విశాస్త్రి

Hello Telugu - Popular Cricketer Ravi Shastri

Hello Telugu - Popular Cricketer Ravi Shastri

Ravi Shastri : ముంబై – మాజీ క్రికెట‌ర్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. యంగ్ క్రికెట‌ర్, భార‌త టెస్టు క్రికెట్ జ‌ట్టు స్కిప్ప‌ర్ శుభ్ మ‌న్ గిల్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు త‌న నాయ‌క‌త్వంలో ఇంగ్లండ్ లో ప‌ర్య‌టిస్తోంది. 5 టెస్టు సీరీస్ లో భాగంగా చెరో మ్యాచ్ ను గెలిచి స‌మంగా ఉన్నాయి. ఇంకా మూడు టెస్టులు ఆడాల్సింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ జ‌ట్టు గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేస్తే 2వ టెస్టులో భార‌త జ‌ట్టు చారిత్రాత్మ‌క‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఏకంగా ఇండియా 336 ప‌రుగుల తేడాతో విక్ట‌రీ సాధించింది. ఈ గెలుపులో కీల‌క‌మైన పాత్ర పోషించాడు శుభ్ మ‌న్ గిల్. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచ‌రీ చేశాడు. 2వ ఇన్నింగ్స్ లో సెంచ‌రీతో దుమ్ము రేపాడు.

Ravi Shastri Praises Shubman Gill

అంత‌కు ముందు భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ ఇంగ్లండ్ పై అరుదైన రికార్డును క‌లిగి ఉన్నాడు. ఈ స‌మ‌యంలో గిల్ ఆట తీరుతో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడ‌ని పేర్కొన్నాడు ర‌విశాస్త్రి (Ravi Shastri). త‌న‌ను క్రికెట్ కు ఆది గురువుగా భావించే స‌ర్ డాన్ బ్రాడ్ మాన్ తో పోల్చాడు. రెండ‌వ టెస్టులో గిల్ ఒక్క‌డే 430 ర‌న్స్ చేశాడ‌ని, ఇది ఏ క్రికెట‌ర్ కు గ‌తంలో సాధ్యం కాలేద‌ని అన్నాడు. కెప్టెన్ గా త‌న తొలి విజ‌యాన్ని న‌మోదు చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నాడు. అటు ఆట‌గాడిగా ఇటు కెప్టెన్ గా వంద మార్కులు కొట్టేశాడ‌ని తెలిపాడు. ఈ టెస్టు సీరీస్ లో ఇప్ప‌టి వ‌ర‌కు శుభ్ మ‌న్ గిల్ మూడు సెంచ‌రీలు చేశాడు. ప్ర‌ధానంగా త‌న నాయ‌క‌త్వాన్ని కూడా ప్ర‌శంసించాడు. ప్ర‌ధానంగా జ‌స్ ప్రీత్ బుమ్రాను కాకుండా ఆకాష్ దీప్ ను ఎంచుకోవ‌డం ప‌ట్ల అభినందించాడు.

Also Read : Mynampally Rohit Shocking Comments : బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖ‌తం దుకాణం బంద్

Exit mobile version