రాకాస‌ గ్రాండ్ స‌క్సెస్ : మూవీ టీం

ఆనందంగా ఉంద‌న్న ద‌ర్శ‌కురాలు

hellotelugu-RAkasaSuccessMeet

హైద‌రాబాద్ : కంటెంట్ బాగుంటే చాలు సినిమాలు స‌క్సెస్ అవుతాయ‌ని నిరూపించింది రాకాస మూవీ. శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన మ‌హిళా ద‌ర్శ‌కురాలు ఈ మూవీని తీశారు. దీనిని నిహారిక కొణిద‌ల నిర్మించారు. ఈ సంద‌ర్బంగా విడుద‌ల‌లైన ఈ చిత్రం అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుంటోంది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇందుకు సంబంధించి స‌క్సెస్ మీట్ కూడా నిర్వ‌హించింది చిత్ర బృదం. ఇదిలా ఉండ‌గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి వచ్చే ప్రతి సినిమాతో మ‌న‌సు, జేబు రెండూ సంతోషంగా ఉండేలా తాను చూసుకుంటాన‌ని తెలిపింది నిహారిక కొణిద‌ల‌. వేస‌వి కాలంలో చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం క‌లిగించేలా చేశామ‌న్నారు. ఈ సీజన్‌లో నిలకడగా విజయం సాధించిన చిత్రాలలో ఒక‌టిగా నిలిచింది .డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, దాని ప్రధాన బృందాన్ని ఒకచోట చేర్చి, ఒక ఉత్సాహ భరితమైన వాతావ‌ర‌ణంలో స‌క్సెస్ మీట్ చేప‌ట్టారు.

రెండవ వారంలో కూడా గణనీయమైన సంఖ్యలో స్క్రీన్‌లలో ప్రదర్శించ బడుతుండటంతో ‘రాకాస’ కేవలం తన జోరును నిలబెట్టు కోవడమే కాకుండా, తన పరిధిని కూడా చురుకుగా విస్తరిస్తోంది. ముఖ్యంగా, ఏప్రిల్ 10 నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సింగిల్ స్క్రీన్‌లలో రూ. 100 ఫ్లాట్ టికెట్ ధరల విధానాన్ని ప్రవేశ పెట్టడం దీనికి నిదర్శనం. కేవలం సంఖ్యల పరంగానే కాకుండా, ఈ చిత్రం స్పష్టంగా ప్రేక్షకుల ఆధారిత విజయంగా రూపు దిద్దుకుంది. దీని థియేట్రికల్ జోరు వెనుక కుటుంబ ప్రేక్షకులు ప్రధాన చోదక శక్తిగా నిలిచారు. తేలికైన, అందరికీ అందుబాటులో ఉండే వినోదాత్మక చిత్రంగా నిలిచింది ‘రాకాస చిత్రం. అన్ని వయసుల వారితో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంది.

Exit mobile version