ఢిల్లీ : టెస్ట్ ఫార్మాట్‌లో గౌతమ్ గంభీర్ స్థానంలో కొత్త హెడ్ కోచ్‌ను నియమించడం లేదా భర్తీ చేయడం గురించి బీసీసీఐ బోర్డు పరిశీలిస్తోందన్న దానిపై స్పందించారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, ఎంపీ రాజీవ్ శుక్లా. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు సంబంధించి మీడియాలో వస్తున్న ఊహాగానాలపై నేను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. భారత జట్టుకు హెడ్ కోచ్‌ను తొలగించే లేదా కొత్త కోచ్‌ను తీసుకువచ్చే ప్రణాళిక ఏదీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా చాలా స్పష్టంగా చెప్పారని అన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
అయితే అవన్నీ ఊహాగానాలేనని పేర్కొన్నాడు. ప్రస్తుతం తన పనితీరు బాగానే ఉందన్నాడు. అయితే జట్టులలో మార్పులు చేయడం అనేది షరా మామూలేనని అంత మాత్రం ప్రతి ఒక్కరినీ తొలగించలేం అంటూ పేర్కొన్నారు రాజీవ్ శుక్లా. బోర్డు కీలక సమావేశంలో చర్చించిన అంశాలు బయటకు ఎవరూ చెప్పరని అన్నారు. ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ తో సీరీస్ ఆడాల్సి ఉందన్నాడు. త్వరలోనే భారత్, శ్రీలంక ఐసీసీ టి20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయని, ఈ కీలక సమయంలో కోచ్ గురించి మాట్లాడటం తగదన్నారు రాజీవ్ శుక్లా.



















