AP Rains Sensational – Prakhar Jain : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో హై అల‌ర్ట్ – ప్ర‌ఖర్ జైన్

రాష్ట్ర వ్యాప్తంగా కుండ పోత వ‌ర్షాలు

Hello Telugu - AP Rains Sensational - Prakhar Jain

Hello Telugu - AP Rains Sensational - Prakhar Jain

Prakhar Jain : అమ‌రావ‌తి – బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప పీడ‌నం ప్ర‌భావం కారణంగా ఇరు తెలుగు రాష్ట్రాల‌లో భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. కుండ‌పోత‌గా కురుస్తున్నాయి. ఇవాళ కూడా చెదురు మదురుగా భారీ వర్షాలు కురుస్తాయ‌ని , తీర ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్ (Prakhar Jain). అల్లూరి సీతారామ‌రాజు, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌న్నారు ఎండీ.

Prakhar Jain Shocking Comments

ఇదే స‌మ‌యంలో ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా రాష్ట్రంలోని ప‌లు ప్రాజెక్టుల‌లోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌స్తోంద‌న్నారు ప్ర‌భాక‌ర్ జైన్. ప్ర‌స్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద అంత‌కంత‌కూ వ‌ర‌ద ఉధృతి పెరుగుతోంద‌న్నారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.50 లక్షల క్యూసెక్కులుగా ఉంద‌న్నారు. దీని కార‌ణంగా
కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించారు ఎండీ ప్ర‌భాక‌ర్ జైన్. నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్ద‌ని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని పేర్కొన్నారు. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాల‌ని కోరారు.

Also Read : Yarlagadda Lakshmi Prasad Alarming : 16 నుంచి టెక్సాస్ లో తెలుగు సాహితీ స‌ద‌స్సు

Exit mobile version