పంజాబ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించిన రాహుల్

నితీష్ రాణాతో క‌లిసి రికార్డు భాగ‌స్వామ్యం

hellotelugu-KLRahul

న్యూఢిల్లీ : ఢిల్లీ క్యాపిట‌ల్స్ పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ చేతిలో ఓడి పోయినా ఇద్ద‌రు ఆట‌గాళ్లు మాత్రం అద్భుత‌మైన ఆటతీరుతో ఆక‌ట్టుకున్నారు. మాజీ కెప్టెన్ కెఎల్ రాహుల్ పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఆడాడు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏకంగా 264 ర‌న్స్ చేసింది. పంజాబ్ కింగ్స్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే విజ‌యం న‌మోదు చేసింది. ఇది కూడా ఓ రికార్డే. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే పంజాబ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్, నితీశ్ రాణా. ఈ ఇద్ద‌రూ క‌లిసి రికార్డు భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు.

కేఎల్ రాహుల్ కేవ‌లం 67 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. 152 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 16 ఫోర్లు 9 భారీ సిక్సులు ఉన్నాయి. త‌న సెంచ‌రీకి తోడు నితీశ్ రాణా కూడా అండ‌గా ఉన్నాడు. త‌ను కేవ‌లం 44 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 91 ర‌న్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. దీంతో నిర్ణీత ఓవ‌ర్ల‌లో కేవ‌లం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి భారీ స్కోర్ న‌మోదు చేసింది. పంజాబ్ బౌల‌ర్ల‌ను ఎంత‌మందిని ప్ర‌యోగించినా ఫ‌లితం లేకుండా పోయింది. ప‌రుగుల వ‌ర‌ద పారించారు ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు. దీంతో పంజాబ్ గెలిచిన‌ప్ప‌టికీ దుమ్ము రేపిన కేఎల్ రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Exit mobile version