Rahul Gandhi : బీహార్ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. బీహార్ క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారి పోయిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికలు ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మాత్రమే కాదు..రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కూడా అని అన్నారు. సీఎం నితీశ్ కుమార్ కుర్చీని కాపాడుకునే పనిలో ఉంటే మంత్రులేమో కమీషన్లకు అలవాటు పడ్డారంటూ ధ్వజమెత్తారు. ఓటు వేసే ముందు పదిసార్లు ఆలోచించాలని కోరారు. లేకపోతే డెమోక్రసీకి అర్థం అనేది ఉండదన్నారు.
Rahul Gandhi Shocking Comments on Bihar Govt
ఓ వైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ (Rahul Gandhi). గతంలో ఎన్నడూ లేనంతగా క్రైమ్ రేట్ పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు నేరాలకు బీహార్ అడ్డాగా మారుతోందని, ఇలాగైతే జనం బతికే పరిస్థితి ఉండదన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో బతకాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే నితీశ్ కుమార్ సీఎంగా ఉంటూ ఏం చేశారంటూ ప్రశ్నించారు. కేవలం ఇంత కాలం పదవి కోసమే పాకులాడాడని, ఎంతో మందితో చేతులు కలిపాడని, కానీ ఎక్కడా రాష్ట్ర అభివృద్ది కోసం ఇసుమంత కృషి చేయలేదని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ.
ప్రజలు ఆయన పాలన పట్ల , తన తీరు పట్ల తీవ్ర అసహనంతో ఉన్నారని చెప్పారు. ఇక నితీశ్ కుమార్ దిగి పోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేవలం పదవిపై ఉన్నంత ఆశ, శ్రద్ద ప్రజలపై లేనే లేదన్నారు రాహుల్ గాంధీ.
Also Read : Saina Nehwal Divorce Shocking : పారుపల్లి కశ్యప్ తో విడి పోతున్నా – సైనా నెహ్వాల్
















