తిప్పేసిన ర‌బాడా చుక్క‌లు చూపించిన హోల్డ‌ర్

త‌ల్లడిల్లిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌల‌ర్లు

hellotelugu-KagisoRabadaJesonHolder

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు బౌల‌ర్లు క‌గిసో ర‌బాడా, జేస‌న్ హోల్డ‌ర్ల అద్బుత‌మైన బౌలింగ్ దెబ్బ‌కు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్లేయ‌ర్లు త‌ల్ల‌డిల్లి పోయారు. మిస్సైల్స్ లాగా దూసుకు వ‌స్తుంటే ఆడేందుకు నానా తంటాలు ప‌డ్డారు. మ్యాచ్ విష‌యానికి వ‌స్తే లీగ్ మ్యాచ్ లో భాగంగా పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో కొన‌సాగుతున్నాయి గుజ‌రాత్ టైటాన్స్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. ఈ మ్యాచ్ సైతం నువ్వా నేనా అన్న రీతిలో సాగుతుంద‌ని అంతా భావించారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ముందుగా బ్యాటింగ్ కు దిగింది గుజ‌రాత్ టైటాన్స్. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో గుజ‌రాత్ టైటాన్స్ 168 ప‌రుగులు చేసింది.. సాయి సుద‌ర్శ‌న్ 44 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 61 ర‌న్స్ చేశాడు. సుంద‌ర్ 33 బంతులు ఎదుర్కొని 50 ర‌న్స్ చేశాడు. 7 ఫోర్లు 1 సిక్స్ కొట్టాడు.

అనంత‌రం మైదానంలోకి దిగిన స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు 14.5 ఓవ‌ర్ల‌లోనే చాప చుట్టేసింది. కేవ‌లం 86 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు టాప్ ప్లేయ‌ర్లు పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. ట్రావిస్ హెడ్ గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు. త‌న‌ను రెండో బంతికే తొలి ఓవ‌ర్ లో క‌ళ్లు చెదిరే బంతితో క‌మాల్ చేశాడు హైద‌రాబాద్ మియా సిరాజ్ భ‌య్యా. ట్రావిస్ హెడ్ దెబ్బ‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ త‌ర్వాత స్టార్ పేస‌ర్లు క‌గిసో ర‌బాడా, జేస‌న్ హోల్డ‌ర్లు చుక్క‌లు చూపించారు. క‌గిసో ర‌బాడా 4 ఓవ‌ర్ల‌లో 28 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీయ‌గా జేస‌న్ హోల్డ‌ర్ 20 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. దీంతో 82 ప‌రుగుల భారీ తేడాతో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. పాయింట్ల ప‌ట్టిక‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకుంది గుజ‌రాత్.

Exit mobile version