PVN Madhav : విశాఖపట్నం : ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 14న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విశాఖపట్టణానికి వస్తారని తెలిపారు. 22న రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సంబురాలు నిర్వహిస్తుందన్నారు. సాగర తీరం విశాఖ మహానగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు ఏపీ బీజేపీ చీఫ్. నగర కార్యకర్తలు ఉదాయాన్నే ఈ కార్యక్రమానికి ప్రదర్శన గావచ్చి పెద్ద ఎత్తున పాలాభిషేకం చేశారు.
AP BJP Chief PVN Madhav Key Comments
అనంతరం పివిఎన్ మాధవ్ (PVN Madhav) మీడియా తో మాట్లాడారు. సరళీకృత జిఎస్టీ ఈ నెల 22వ తేదీ నుంచి అమలు జరుగుతున్న నేపథ్యంలో అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనున్నట్లు మాధవ్ ప్రకటించారు. 2017 లో జిఎస్టీ అమలు లోకి వచ్చిందన్నారు. గతంలో నాలుగు స్లాబ్ రేట్స్ ఉండేవన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూర్చేలా తాజాగా కేంద్రం రెండు స్లాబ్ రేట్లకే పరిమితం చేసిందన్నారు. దీంతో జీఎస్టీని రెండు అంచెలకు తీసుకు రావడం, ప్రజలకు ఊరటను ఇచ్చేలా చేసిందన్నారు.
దీని కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని చెప్పారు పీవీఎన్ మాధవ్. రైతాంగానికి అవసరమైన వస్తువులు ధరలు కూడా భారీగా తగ్గుతాయని చెప్పారు. నిర్మాణ రంగానికి ఉపశమనం కలుగుతుందన్నారు. మధ్యతరగతి ప్రజలు కు ఊరట లభిస్తుందన్నారు. జిఎస్టీ తగ్గింపు అన్నివర్గాల లో ఆనందాన్ని ఇస్తోందన్నారు మాధవ్. హానికరమైన పదార్థాలు పై జిఎస్టీ పెంచడం మేలు గా భావించాలన్నారు. విశాఖ లో రైల్వే గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభ కు బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా వస్తారని చెప్పారు మాధవ్.
Also Read : Army Chief General Dwivedi Warning : భారత వైమానిక శక్తి ఏమిటో చూపించాం

















