Putin : రష్యా : రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో తమ దేశం ఎలాంటి సమస్యలు లేని బంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రత్యేకించి వాణిజ్య పరంగా ఎలాంటి అంతరాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇండియాతో తాము ఎల్లకాలం బలమైన బంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. డిసెంబర్ ప్రారంభంలో తన రాబోయే భారత పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) తన అంచనాను వ్యక్తం చేశారు . భారీగా ముడి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల భారతదేశంతో వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి చర్యలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
Russia President Putin Key Comments
దక్షిణ రష్యాలోని సోచిలోని నల్ల సముద్రం రిసార్ట్‌లో భారతదేశంతో సహా 140 దేశాల నుండి భద్రతా , భౌగోళిక రాజకీయ నిపుణుల అంతర్జాతీయ వాల్డాయ్ చర్చా వేదికలో వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. రష్యా , భారతదేశం మధ్య ఎప్పుడూ సమస్యలు లేనే లేవని పేర్కొన్నారు. మరో వైపు అమెరికా ఇండియాతో ఘర్షణ వాతావరణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే 100 శాతం పన్నులు కేవలం విదేశీ సినిమాలపై సుంకం విధించారు. మరో వైపు వస్తువులపై 50 శాతం టారిఫ్ విధించారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత దేశం ఆనాడు స్వాతంత్ర పోరాటం నుంచి నేటి దాకా తమ రష్యా దేశం పూర్తిగా మద్దతును ప్రకటిస్తూ వస్తోందన్నారు. ఒక్క ఆయిల్ మాత్రమే కాదు అన్ని రంగాలలోనూ ఇండియాతో బలమైన బంధాన్ని కోరుకుంటోందన్నారు.
Also Read : Popular FIFA World Cup : ఫిఫా ప్రపంచ కప్ బంతి ఆవిష్కరణ


















