Punjab Singer Sidhu : పంజాబ్ : పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు హర్మాన్ సిద్దు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఆయన మృతితో తీవ్ర విషాదం అలుముకుంది. తన వయసు కేవలం 37 ఏళ్లు మాత్రమే.
మాన్సా జిల్లాలోని ఖ్యాలా గ్రామంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. సిద్దు (Punjab Singer Sidhu) పాడిన పాటలు పేపర్ యా ప్యార్, బెబే బాపు పాపులర్ అయ్యాయి. ఆయన తన గ్రామానికి తిరిగి వెళుతుండగా మాన్సా-పాటియాలా రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.ఆయన కారు ట్రక్కును ఢీకొట్టడంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయిందని నివేదికలు చెబుతున్నాయి. సిద్ధు అక్కడికక్కడే మరణించాడు.
Punjab Singer Sidhu Death Sensational
హర్మాన్ సిద్ధు ఆకస్మిక మరణ వార్త ఆయన అభిమానులను, ప్రత్యేకించి సంగీత పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన భార్య, కుమార్తె బతికి ఉన్నారు. కాగా హర్మాన్ సిద్దు తండ్రి ఏడాదిన్నర క్రితం మరణించారు. కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయకుడు మృతి చెందడం పట్ల సినీ ప్రముఖులు, పంజాబ్ కు చెందిన గాయనీ గాయకులు తీవ్ర సంతాపం తెలిపారు. అద్భుతమైన ప్రతిభావంతుడైన గాయకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Also Read : Mallikarjun Kharge Important Update : నాలుగు జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం



















