Puducherry Govt : పుదుచ్చేరి : ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీకి చెందిన 25 ఎలక్ట్రిక్ బస్సులను సోమవారం జెండా ప్రారంభించారు పుదుచ్చేరి (Puducherry Govt) గవర్నర్, సీఎం లు. పుదుచ్చేరి రవాణా సంస్థలో ఇవి భాగం కానున్నాయి. ఈ సందర్భంగా ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ బాబు మాట్లాడారు. పుదుచ్చేరి ప్రభుత్వం, పీ ఆర్ టి సితో స్మార్ట్ సిటీ మిషన్ కింద స్థిరమైన రవాణా రంగంలో భాగస్వామ్యం కావడం మాకు గర్వకారణంగా ఉందన్నారు. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టడం ద్వారా భారతదేశంలో పరిశుభ్రమైన ప్రజా రవాణా వ్యవస్థను రూపుదిద్దడంలో ఓలెక్ట్రా తన నిబద్ధతను మరోసారి చాటుకుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడంలో సహకరించిన లెఫ్టినెంట్ గవర్నర్ కైలాశ్‌నాథన్, సి ఎం రంగసామి తదితరులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు ఎండీ.
Puducherry Govt New Innovation
స్మార్ట్ సిటీ మిషన్ పరిధిలో అమలైన ఈ ప్రాజెక్ట్‌లో బస్సులను ఓలెక్ట్రా సరఫరా చేయగా, ఆపరేషన్, నిర్వహణ, చార్జింగ్ వంటి సేవలను ఈవీ ట్రాన్స్ నిర్వహిస్తోంది. ఒలెక్ట్రా తయారు చేసిన ప్రోటోటైప్ బస్సులను పుదుచ్చేరి రవాణా శాఖ అధికారులు పరిశీలించి ఆమోదించిన అనంతరం బస్సులను ప్రవేశ పెట్టారు. ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో పుదుచ్చేరి కూడా దేశంలో ఒలెక్ట్రా బస్సులను నడిపే నగరాల జాబితాలో చేరింది. దేశవ్యాప్తంగా ఒలెక్ట్రా బస్సులు ఇప్పటివరకు 440 మిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి. ఫలితంగా సుమారు 135.4 మిలియన్ లీటర్ల డీజిల్ ఆదా ఐంది . సుమారు 362.8 మిలియన్ కిలోగ్రాముల కర్బన ఉద్గారాలను తగ్గించింది. దాదాపు 1.68 కోట్ల చెట్లు నాటటం వల్ల వచ్చే పర్యావరణ ప్రయోజనం దీని వల్ల సాధ్యమైందని చెప్పారు మహేష్ బాబు.
Also Read : MLC Rajendra Prasad Fired on YSRCP : వైసీపీ శవ రాజకీయాలు మానుకోవాలి

















