కేరళ : వాయనాడు లో చోటు చేసుకున్న కొండ చరియలు విరిగి పడిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది . ఈ సందర్బంగా సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టింది యుడీఎఫ్ సర్కార్. జిల్లా యంత్రాంగం తో పాటు తిరువనంతపురం నుండి వస్తున్న మంత్రులు టి. సిద్ధిక్ , ఎ.పి. అనిల్ కుమార్, స్థానిక పార్టీ నేతలు , సంబంధిత సంస్థలతో తాము సమన్వయం చేసుకుంటున్నామని వాయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మేము మీకు అండగా ఉంటూ, సాధ్యమైనంత వరకు అన్ని విధాలా మద్దతునిస్తామని తెలిపారు. ఇంకా ఆచూకీ లభించని వారి కోసం మేము ప్రార్థిస్తున్నామని వెల్లడించారు ఎంపీ. కేంద్ర, రాష్ట్ర సహాయక దళాలు సహయాక బృందాలు చురుకుగా పాల్గొన్నాయని పేర్కొ్నారు ప్రియాంక గాంధీ.
సహాయక బృందాలు వారిని చేరే వరకు వారు ధైర్యంగా ఉండాలని, అలాగే వారి కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు ఈ బాధాకరమైన సమయంలో ధైర్యం లభించాలని కోరుకుంటున్నాను అని వాద్రా అన్నారు. చ్చింది. పరిపాలనా యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూనే, సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందించాలని ఆమె UDF కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సమయంలో, సహాయక , రక్షణ చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలి . ఎటువంటి అంతరాయం లేకుండా సాధ్యమైనంత సహాయం అందంచాలని అని ఆమె పేర్కొన్నారు. ఈ జిల్లాలోని కల్లాడిలో సంభవించిన కొండచరియల విరిగిపడే ఘటనలో ఒకరు మరణించారని, ఏడుగురు గాయపడ్డారని , మరో ఏడుగురు గల్లంతయ్యారని కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ తెలిపారు.















