Priyank Kharge : బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge). శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం , డిప్యూటీ సీఎంతో పాటు నాకు కూడా ఈ విషయం తెలియదని చెప్పారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సమావేశం ఉంటే ఉండి ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీ హైకమాండ్ తీసుకునే దానిపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు ప్రియాంక్ ఖర్గే. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ అత్యవసరమని అనుకుంటే అప్పుడు హైకమాండ్ రంగంలోకి దిగుతుందన్నారు. దాని కోసం హైరానా పడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి.
Priyank Kharge Key Comments on CM Changes Issue
విచిత్రం ఏమిటంటే ఇతర పార్టీల కంటే భిన్నమైన పార్టీ మాది. ఇక్కడ కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడి వరకు తమ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటుందన్నారు ప్రియాంక్ ఖర్గే. కానీ ఇతర పార్టీలలో ఎవరికి వారే సుప్రీం అని, అక్కడ తమకు ఉన్నంత ఫ్రీడం ఉండదన్నారు. సీఎం పోస్టు కీలకమైనదని, ఎవరికి వారే తాము ఆశించడంలో తప్పు లేదన్నారు. ఏది ఏమైనా తమ సర్కార్ పూర్తి కాలం ఉంటుందని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని అస్థిర పరిచేందుకు నానా తంటాలు పడుతున్నారని , ప్రయత్నం చేస్తున్నారని , కానీ వారి ఆశలు గల్లంతు కావడం ఖాయమని జోష్యం చెప్పారు ప్రియాంక్ ఖర్గే.
Also Read : KTR Fired on CM Revanth Reddy : పాలమూరుకు రేవంత్ రెడ్డి చేసింది శూన్యం

















