Prashant Kishor : బీహార్ : ప్రముఖ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జన్ సురక్ష పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా ఏఐసీసీ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ (Prashant Kishor) లేవనెత్తిన అంశాలపై స్పందించారు. గురువారం పీకే మీడియాతో మాట్లాడారు. హర్యానా రాష్ట్రంలో గత ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. అంతే కాకుండా 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎన్నికల కమిషనర్లు కేంద్ర సర్కార్ తో కుమ్మక్కయ్యారని సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. దీనిపై కామెంట్స్ చేశారు పీకే.
Prashant Kishor Comments
ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల ప్రక్రియ గురించి రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న ప్రశ్నలు చెల్లుబాటు అయ్యేవని పేర్కొన్నారు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల కమిషన్ వాటికి స్పందించాలనే డిమాండ్‌కు తాము మద్దతు ఇస్తున్నామన్నారు. అయితే బీహార్ రాష్ట్రం విషయానికొస్తే, ఇక్కడ అది ప్రధాన సమస్య కానే కాదన్నారు. బీహార్ ఎన్నికల్లో నిజమైన సమస్యలు వలసలు, అవినీతి, పిల్లల విద్య అనేది ముఖ్యమన్నారు జన్ సురక్ష అధ్యక్షుడు.
ఇదిలా ఉండగా తాజాగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఆయన గతంలో కర్ణాటకలో, ఆ తర్వాత మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రంలో నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read : Minister Atchannaidu Important Letter : పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలి
















