Prashant Kishor : బీహార్ : ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ కు షాక్ తగిలింది. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. అయితే ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారాలను ప్రారంభించాయి. తాజాగా ఆదివారం ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. క్యాంపెయిన్ లో భాగంగా తేజస్వి యాదవ్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి హాజీపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు . బీహార్‌లోని రఘోపూర్‌లో ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ప్రచారం సందర్భంగా మోడల్ కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఈ కేసు నమోదు చేయడం విశేషం. హాజీపూర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుబోధ్ కుమార్ ప్రకారం, వైశాలి జిల్లాలోని రఘోపూర్ పోలీస్ స్టేషన్‌లో జన్ సురక్ష పార్టీ పై కేసు నమోదు చేసినట్లు ధ్రువీకరించారు.
Prashant Kishor Gets Case
ఇదిలా ఉండగా ప్రచార కార్యక్రమానికి అనుమతి సతేంద్ర ప్రసాద్ సింగ్ పొందారు. అందువల్ల, MCC ఉల్లంఘనకు సంబంధించి దాఖలు చేసిన ఎఫ్ ఐ ఆర్ లో అతని పేరు చేర్చామని, కానీ ప్రశాంత్ కిషోర్ పేరు చేర్చలేదని స్పష్టం చేశారు. కాగా ప్రశాంత్ కిషోర్ సందర్శించిన ప్రదేశాలను పర్యటిస్తున్న హాజీపూర్ సబ్-డివిజనల్ అధికారి తన దర్యాప్తును పూర్తి చేసిన తర్వాత మరికొందరి పేర్లను కూడా చేర్చే ఛాన్స్ లేక పోలేదన్నారు. ఈ సందర్భంగా కేసుల నమోదుపై ప్రశాంత్ కిషర్ స్పందించారు. తనపై రాష్ట్రంలో చాలా ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని, వాటికి భయపడే ప్రసక్తి లేదన్నారు. ఇవన్నీ చాలా పెండింగ్ లో ఉన్నాయని, ఇది కూడా అందులో మరికొటి చేరుతుందంటూ కొట్టి పారేశారు ప్రశాంత్ కిషోర్.
Also Read : Smriti Mandhana Sensational : చరిత్ర సృష్టించిన స్మృతీ మందన్నా
















