Prabhas : ఎవరీ ఆలిమ్ హకీమ్ అనుకున్నారా. అత్యంత ప్రజాదరణ పొందిన హెయిర్ స్టైలిష్. తను టాప్ హీరోస్ కు మంచి లుక్ ను తీసుకు రావడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. టాప్ హీరోలంతా తననే కోరుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం అందరి కళ్లు డార్లింగ్ ప్రభాస్ పై పడింది. తను ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం స్పిరిట్. ఇందులో ముంబై బ్యూటీ త్రిప్తి డిమ్రీ కీలక రోల్ పోషిస్తున్నాడు. తాజాగా ఆలిమ్ హకీమ్ చర్చనీయాంశంగా మారాడు.
Prabhas – Spirit Movie Hair Style
ఇందులో భాగంగా ప్రభాస్ (Prabhas) తో పని చేస్తున్నాడు. తనకు కొత్తగా హెయిర్ స్టైల్ ను డిజైన్ చేయడంలో ఫోకస్ పెట్టాడు. ఈ టాప్ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ భారతీయ సినిమాకి చెందిన అనేక మంది అగ్ర నటుల లుక్స్ డిజైన్ చేశారు. గతంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ టాప్ నటుల కోసం ఆయన పనిచేశారు. ఆలిమ్ హకీమ్ ఇప్పుడు తన రాబోయే చిత్రం స్పిరిట్‌లో ప్రభాస్ లుక్‌ను డిజైన్ చేయనున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. స్పిరిట్‌లో ప్రభాస్ లుక్‌ను ఆలిమ్ హకీమ్ డిజైన్ చేస్తారని సందీప్ రెడ్డి వంగా స్వయంగా ప్రకటించారు.
ఆలిమ్ హకీమ్ రణబీర్ కపూర్ నటించిన యానిమల్, కబీర్ సింగ్‌లో షాహిద్ కపూర్‌లకు కూడా పనిచేశారు. ఈ రెండు చిత్రాలకు సందీప్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ ప్రారంభించే ముందు రాజా సాబ్, ఫౌజీ షూటింగ్‌లను పూర్తి చేస్తాడు. ఈ యాక్షన్ డ్రామాలో ఆయన పోలీసుగా నటించారు. టి సిరీస్, భద్రకాళి ఫిల్మ్స్ స్పిరిట్‌ను నిర్మిస్తున్నాయి.
Also Read : Rahul Dravid Quit Sensational : రాజస్థాన్ రాయల్స్ నుంచి ద్రవిడ్ నిష్క్రమణ


















