The Raja Saab : హైదరాబాద్ – పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కీ రోల్ పోషించిన రాజా సాబ్ శర వేగంగా షూటింగ్ జరుపుకున్నా విడుదల తేదీ మాత్రం రోజు రోజుకు వాయిదా పడుతూ ఉండడం పట్ల డార్లింగ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు మారుతిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంతకు సినిమా వస్తుందా రాదా అన్న అనుమానం వ్యక్తం చేయడం కలకలం రేపింది. ఇదే సమయంలో రాజా సాబ్ (The Raja Saab) గురించి సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలను ఖరారు చేయడం, ఆ తర్వాత దానిని మార్చడం జరుగుతూ వస్తోంది.
Darling Prabhas The Raja Saab Movie Updates
ప్రస్తుతం ప్రభాస్ ఇంకో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ అయి పోగానే డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసే స్పిరిట్ తో జాయిన్ అవుతాడు. ఇంతలోపే రాజా సాబ్ వస్తుందని ప్రకటించాడు దర్శకుడు మారుతి. తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అదేమిటంటే వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. దర్శకుడు రాజా సాబ్ ను హార్రర్, కామెడీ ప్రధానంగా తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిరాయ్ ట్రైలర్ లాంచ్ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో చావు కబురు చల్లగా చెప్పారు రాజా సాబ్ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. అధికారికంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా చాలా సినిమాలు సంక్రాంతి పర్వదినం సందర్బంగా రిలీజ్ అవుతాయి.
Also Read : Peter Navarro Fired on PM Modi : మోడీపై నోరు పారేసుకున్న ట్రంప్ అడ్వైజర్


















