త్వరలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ : సీఎం

మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో చంద్రబాబు

hellotelugu-APCM

అమరావతి : మంత్రులు, కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీల అమలు క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుందోననే అంశంపై ప్రత్యక్షంగా చూడాలని సూచించారు. పైస్థాయిలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా… క్షేత్ర స్థాయిలో పాలసీలు అమలుకానప్పుడు ఫలితం ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. వారి వారి శాఖల పనితీరు ఎలా ఉందన్న అంశంపై పరిశీలించడానికి తరుచూ ఫీల్డ్ విజిట్స్ చేపట్టాలని సీఎం సూచించారు. వివిధ వర్గాల ప్రజలతో అధికారులు తరుచూ మాట్లాడుతూ ఉంటే చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.

సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఐదవ బ్లాకులో మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…’ప్రతీ ఐదేళ్లకూ జీఎస్డీపీ, తలసరి ఆదాయం రెట్టింపు అయ్యేలా ప్రణాళికలు చేపట్టాలి. తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తుంది. కీ-పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల విషయంలో జాగ్రత్తగా అంచనాలు వేయాలి. క్షేత్రస్థాయి నుంచి తీసుకునే సమాచారం ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసుకోవాలి. పీ4 అనేది రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు తగ్గించే ప్రత్యేక కార్యక్రమం. మార్గదర్శులు బంగారు మిత్రలను నియమించుకోవాలి… వారి ద్వారా ఆయా పేద కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి.

Exit mobile version