Ponnam Prabhakar : హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ మంత్రులు తమ తీరు మార్చు కోవడం లేదు. రాజకీయాలలో పోటీ చేయడం , ఆరోపణలు చేసుకోవడం సర్వ సాధారణం. కానీ దివంగత నాయకుడి భార్యను పనిగట్టుకుని, ఓ మహిళను ఉద్దేశించి కామెంట్స్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponnam Prabhakar) జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరపున బరిలో నిలిచిన మాగంటి సునీత గురించి నోరు పారేసుకున్నారు. ఆమె తన భర్తను తలుచుకుని భావోద్వేగానికి లోనైతే, ఓట్ల కోసం ఏడ్చిందంటూ ఎద్దేవా చేశారు. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. పెద్ద ఎత్తున అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి.
Minister Ponnam Prabhakar Shocking Comments on Maganti Sunitha
అయినా మారలేదు. బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. మాగంటి సునీతను మళ్ళీ అవహేళన చేశాడు. బీ-ఫాం తీసుకోవడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరకు వెళ్ళినప్పుడు సునీత ఎందుకు ఏడవలేదు అని వెటకారం చేశాడు. ఓట్ల కోసం కావాలని సునీతను ఏడిపిస్తున్నారు అని దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. భర్త మాగంటి గోపీనాథ్ చనిపోయాక కేసీఆర్‌ను రెండోసారి కలిసిన సునీతకు కేసీఆర్‌ను చూస్తే ఎందుకు దుఃఖం రాలేదని ప్రశ్నించాడు .సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నంలో మాగంటి సునీత కృత్రిమ ఏడుపులు ఏడుస్తుంది అని పొన్నం ప్రభాకర్ నిన్న ఎగతాళి చేశాడు.
Also Read : Maganti Sunitha Nomination Interesting : బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్















