RGV : ప్రకాశం జిల్లా – ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ఎట్టకేలకు ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. దాదాపు 11 గంటలకు పైగా విచారణ చేపట్టారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లను కించ పరుస్తూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. ఆపై ఏకంగా సోషల్ మీడియాలో వారిని కించ పరిచేలా ఫోటోలు పెట్టారు. అవి క్షణాల్లోనే వైరల్ గా మారాయి. గతంలో ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్జీవీ రెచ్చి పోయారు. ఆయన ఫక్తు వైసీపీకి అనధికారికంగా స్పోక్స్ పర్సన్ గా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన కూటమి పవర్ లోకి వచ్చింది.
RGV Investigation
వచ్చిన వెంటనే తమను టార్గెట్ చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కూడా బిగ్ షాక్ తగిలింది. ఇదిలా ఉండగా మార్ఫింగ్ ఫోటోలను పెట్టడంపై కేసు నమోదైంది. ఇదే క్రమంలో వైసీపీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి రూ.2 కోట్లు చెల్లించినట్లు గుర్తించింది సర్కార్. విచారణ చేపట్టారు పోలీసులు. కాగా విచారణ సందర్భంగా ఒంగోలు పోలీసుల దర్యాప్తునకు ఆర్జీవీ సహకరించ లేదని సమాచారం. తెలియదు, గుర్తు లేదు, పరిచయం లేదంటూ చెప్పారని పేర్కొన్నారు. విచారణ లో భాగంగా ఆర్జీవీ ఫోన్ ను సీజ్ చేశారు. ఫోన్ నుంచి డేటా సేకరించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : Telangana High Alert Warning : ఎడ తెగని వాన తల్లడిల్లిన తెలంగాణ



















